seeyonulo nundi neevu prakashinchuchunnavu || Hosanna Ministries Official 2019 ||

సీయోనులో నుండి నీవు - ప్రకాశించుచున్నావు నాపై 

సీయోనులో నుండి నీవు - ప్రకాశించుచున్నావు నాపై 
సమాధానమై - సదాకాలము నను నీతో 
 నడిపించుచున్నావు నీకీర్తికై 
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా


1. నిర్దోషమైన మార్గములో - నా అంతరంగమున ధైర్యమునిచ్చి 
నీ సన్నిధిలో ననునిలిపి - ఉన్నత విజయమునిచ్చితివి 
నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు 
 విడువవు నను యెడబాయవు 
నీవు విడువవు నను యెడబాయవు 


2. నాయందు దృష్టినిలిపి - నీస్నేహబంధముతో ఆకర్షించి 
 కృపావరములతో ననునింపి - సత్యసాక్షిగా మార్చితివి 
 నీ మనస్సును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని 
 కీర్తిoచెదను ప్రతినిత్యం 
నిను ఆరాధింతును అనుక్షణము 


3. నీ దివ్యమైన మహిమను - పరలోకమందునే చూచెదను 
నీ కౌగిలిలొ చేర్చుకొని - ప్రతిభాష్పబిందువును తుడిచెదవు 
నీ మాటల మకరందమును - మరపురాని అనుబంధమును 
 మరువను ఎన్నడు విడువను 
నేను మరువను ఎన్నడు విడువను



 Hosanna Ministries 
 
              

Comments